పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ రెండు జట్లూ ఇవాళ ఢీకొడుతున్నాయి. ఐపీఎల్ 2022లో భాగంగా జరుగుతున్న 32వ మ్యాచ్‌లో ఈ రెండు జట్లు తలపడుతున్నాయి. ముంబైలోని బ్రబోర్న్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఢిల్లీ కెప్టెన్ రిషభ్ పంత్ టాస్ గెలిచాడు. కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన మిచెల్ మార్ష్ స్థానంలో సర్ఫరాజ్ ఖాన్‌ను తీసుకున్నట్లు పంత్ తెలిపాడు. పంజాబ్ జట్టులో రెండు మార్పులు జరిగాయి. మయాంక్ తిరిగి రావడంతో ప్రభ్‌సిమ్రాన్ సింగ్ బెంచ్‌కే పరిమితం అయ్యాడు.…