Karnataka Bank heist: కర్ణాటక పోలీసులు దావణగెరె ఎస్‌బీఐ దోపిడీని ఛేదించారు. హై ప్రొఫైల్ న్యామతి ఎస్‌బీఐ బ్యాంక్ దొంగతనం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దాదాపు రూ. 13 కోట్ల విలువైన 17.7 కిలోల బంగారాన్ని దోపిడీ చేశారు. కర్ణాటక పోలీసులు 5 నెలలు కష్టపడి దర్యాప్తు చేసి, ఈ కేసులో ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసి, మొత్తం బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.