రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. మాస్టర్ కార్డులపై గతంలో విధించిన ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు ఆర్‌బీఐ ప్రకటించింది. పేమెంట్స్ డేటా స్టోరేజీ నిబంధనలు పాటించని కారణంగా గతేడాది మాస్టర్ కార్డులపై ఆంక్షలు విధించామని.. దీనిపై మాస్టర్ కార్డు యాజమాన్యం ఇచ్చిన వివరణ సంతృప్తిగా ఉండటంతో ఆంక్షలు ఎత్తేస్తున్నట్లు ఆర్‌బీఐ వెల్లడించించి. ఆర్‌బీఐ ఆంక్షలు ఎత్తివేయడంతో కొత్త కార్డుల జారీ త్వరలోనే ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. కాగా పేమెంట్స్‌కు సంబంధించిన డేటా భద్రపరచాలని 2018…