Mohammad Shami: టీమిండియా బౌలర్ మహ్మద్ షమీ చేసిన ఓ పోస్టుపై సోషల్ మీడియాలో దారుణంగా ట్రోలింగ్స్ వస్తున్నాయి. దీంతో క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళ్తే.. దసరా సందర్భంగా తన అభిమానులకు ట్విట్టర్ వేదికగా మహ్మద్ షమీ శుభాకాంక్షలు తెలిపాడు. ‘దసరా పర్వదినాన శ్రీ రాముడు మీ జీవితంలోని కోరికలను అన్నింటినీ నెరవేర్చాలని నేను కోరుకుంటున్నాను. అలాగే మీ జీవితంలో సంతోషం, సంపద, విజయం అందించాలని నేను…