న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ డారిల్ మిచెల్ చరిత్ర సృష్టించాడు. భారత గడ్డపై కనీసం నాలుగు వన్డే సెంచరీలు చేసిన రెండో బ్యాటర్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు. ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో భారత్‌తో జరిగిన మూడో వన్డేలో శతకం బాదడంతో ఈ రికార్డు అతడి ఖాతాలో చేరింది. 34 ఏళ్ల మిచెల్.. భారత్‌లో టీమిండియాపై ఆడిన తన 8వ వన్డేలోనే నాలుగో సెంచరీ సాధించడం విశేషం. ఈ మ్యాచ్‌లో మిచెల్ 104 బంతుల్లో శతకం పూర్తి చేశాడు. భారత గడ్డపై…