Today (05-01-23) Business Headlines: డార్విన్ బాక్స్‌కి రూ.40.5 కోట్లు: మానవ వనరుల సేవలు అందించే హైదరాబాద్ స్టార్టప్ డార్విన్ బాక్స్ తాజాగా దాదాపు 40 కోట్ల రూపాయలకు పైగా నిధులను సమీకరించింది. సిరీస్ డీ ఫండ్ రైజ్‌లో భాగంగా వీటిని సేకరించింది. ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ ఫండ్స్‌ను సమకూర్చింది. ఏడేళ్ల కిందట స్థాపించిన డార్విన్ బాక్స్ ఇటీవలే యూనికార్న్ హోదా పొందిన సంగతి తెలిసిందే.