TTD : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తిరుమలలో రాజకీయ, ద్వేషపూరిత ప్రసంగాలను నిషేధించింది. ఇటీవల జరిగిన టీటీడీ బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం ఖరారు కాగా, ఇప్పుడు అధికారికంగా అమలులోకి వచ్చింది. ఈ నిబంధనను ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని టీటీడీ స్పష్టం చేసింది. తిరుమలలో మీడియాను ఉద్దేశించి రాజకీయ నేతలు రాజకీయ ప్రకటనలు చేయడం, తరచూ విమర్శలకు దిగడం వంటి ట్రెండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కొండ పుణ్యక్షేత్ర ప్రాంగణంలో ఇలాంటి…