Darshan Case: హత్య నేరంలో జైలులో శిక్ష అనుభవిస్తున్న కన్నడ స్టార్ దర్శన్ తనకు దుప్పటి కావాలని కోర్టును కోరాడు. బుధవారం బెంగళూరులోని ట్రయల్ కోర్టులో అదనపు దుప్పటి కోసం విన్నవించుకున్నాడు. చలి కారణంగా తనకు నిద్ర పట్టడం లేదని చెప్పాడు. విచారణ ప్రక్రియ కోసం దర్శన్‌ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు హాజరుపరిచారు.
కన్నడ ప్రముఖ నటుడు దర్శన్, ప్రస్తుతం రేణుకాస్వామి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ పరప్పన అగ్రహార జైల్లో విచారణ ఖైదీగా ఉన్నారు. అయితే, జైలులో ఆయనకు నరకం చూపిస్తున్నారని, ఉగ్రవాదులను ఉంచే హై-సెక్యూరిటీ సెల్‌లో ఒంటరిగా బంధించారని ఆయన తరపు న్యాయవాది కోర్టులో తీవ్ర వాదనలు వినిపించారు. హత్య కేసులో అరెస్టయిన దర్శన్‌ను జైలు అధికారులు అత్యంత కఠినంగా చూస్తున్నారని ఆయన లాయర్ సివిల్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇతర ఖైదీలతో కలవకుండా, మానసికంగా వేధించే ఉద్దేశంతో…
చిత్రదుర్గ వాసి రేణుకాస్వామిని దారుణంగా హత్య చేసిన కేసులో కన్నడ నటుడు దర్శన్, పవిత్ర గౌడ్, మరికొందరిని మంగళవారం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. వీరికి తొలుత ఆరు రోజుల పోలీసు కస్టడీ విధించగా, అది రేపు ఆదివారంతో ముగియనుంది. అయితే రేపు ఆదివారం కావడంతో పోలీసులు వారిని ఒకరోజు ముందుగానే కోర్టు ముందు హాజరుపరిచారు. వారి కస్టడీని పొడిగించాలని పోలీసులు కోర్ట్ ని అభ్యర్థించగా, దానికి న్యాయమూర్తి ఆమోదం తెలిపారు, అదనంగా ఐదు రోజుల పోలీసు…
Sandalwood Actor Darshan Arrested in Murder Case: ఓ యువకుడి హత్య కేసులో ప్రముఖ కన్నడ నటుడు, ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ తూగుదీపను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం ఉదయం మైసూరులో దర్శన్‌తో పాటు మరో పది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్య కేసులో విచారణ నిమిత్తం వారిని బెంగళూరుకు తరలించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… చిత్రదుర్గలోని లక్ష్మీ వెంకటేశ్వర బరంగయ్‌లో నివాసం ఉంటున్న రేణుకా స్వామి…