Yellow Crazy Ants: చీమే కదా అని తక్కువ అంచనా వేయకండి. సైజులో చిన్నగా ఉన్నా చీమ కుడితే ఎంతటి ప్రాణి అయినా గిలగిల కొట్టుకోవాల్సిందే. చీమలు లక్షల సంఖ్యలో దండయాత్ర చేస్తే ప్రజలు వణికిపోవాల్సిందే. తమిళనాడులోని పలు గ్రామాల్లో ప్రస్తుతం ఇలాంటి పరిస్థితే నెలకొంది. అక్కడి గ్రామాలపై చీమలు దండెత్తాయి. గ్రామాల్లోకి చొచ్చుకొస్తున్న చీమల దండు కనిపించిన ప్రతి వస్తువును తినేస్తుండటంతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. దీంతో గ్రామాలను ఖాళీ చేసి ఇతర ప్రాంతాలకు తరలివెళ్లిపోతున్నారు.…