దేశ రాజధాని ఢిల్లీని భారీ వరదలు ముంచెత్తాయి. ఇటీవల కురిసిన వర్షాలతో యమునా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఇప్పటికే ప్రమాదకర స్థాయిని దాటగా.. ప్రస్తుతం 207.41 మీటర్ల దగ్గర నీటి ప్రవాహం కొనసాగుతోంది.
దేశ రాజధాని ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్‌ను భారీ వరదలు ముంచెత్తాయి. సోమవారం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రధాన ప్రాంతాలన్నీ అతలాకుతలం అయ్యాయి.
అస్సాంను భారీ వరదలు ముంచెత్తాయి. 1,275 గ్రామాలపై వరద ప్రభావం చూపించింది. దీంతో 6.4 లక్షల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఇక బాధితులకు 72 సహాయ కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
దేశవ్యాప్తంగా కురుస్తున్న వర్షాల కారణంగా పలు రాష్ట్రాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. యమునా నది నీటి మట్టం ప్రమాద స్థాయికి మించి ప్రవహిస్తోంది. ఢిల్లీలోని పాత రైల్వే వంతెన వద్ద 206.26 మీటర్ల స్థాయికి చేరుకుంది.
ఢిల్లీలో యమునా నది నీటి మట్టం శుక్రవారం మరోసారి ప్రమాద స్థాయి 205.33 మీటర్లను దాటి ప్రవహిస్తోంది. యమునా నది శాంతించిందని ఢిల్లీ ప్రజలు ఊపిరిపీల్చుకునే లోపే మరోసారి వరద ప్రవాహం పెరగడంతో ఆందోళనకు గురవుతున్నారు.