ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ జో రూట్ ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతున్నాడు. అయితే ఈ సీజన్ లో ఇప్పటి వరకు అతడు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. కానీ ఆ అటాకింగ్ ప్లేయర్ మాత్రం తన డ్యాన్సింగ్ స్కిల్స్ తో ఊపేస్తున్నాడు. ఐపీఎల్ టీమ్ మేట్ యజువేంద్ర చాహల్ తో కలిసి ఓ హిందీ పాటకు స్టెప్పులేశాడు. ప్రస్తుతం ఆ వీడియో ఆన్ లైన్ లో వైరల్ అవుతుంది.