Shruti Haasan: తమిళ సినిమాల ద్వారా కెరీర్ స్టార్ చేసిన శృతి హాసన్.. సిద్ధార్థ్ హీరోగా నటించిన అనగనగా ఓ ధీరుడు చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయ్యారు. కెరీర్ మొదట్లో ఐరన్ లెగ్ అనిపించుకున్న ఈ భామ.. పవన్ కల్యాణ్ సరసన గబ్బర్ సింగ్ చిత్రంతో స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగిపోయారు.