జాతీయ రాజకీయాలపై కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు. దేశం కోసం ఎలా పోరాడబోతున్నానో వివరించారు. అది ఆయన మాటల్లోనే.. ‘నేను బీజేపీ, కాంగ్రెస్, చంద్రబాబు, సీపీఐ వంటి పార్టీలతో జైతెలంగాణ అనిపించలేదా. అదీ కేసీఆర్ అంటే. నేను దేశం కోసం పోరాటం మొదలుపెట్టబోతున్నా. నేను ఒకసారి ఫిక్స్ అయ్యానంటే అందరూ నాతో వస్తారు. బీజేపీని ఇప్పటికిప్పుడు టార్గెట్ చేయను. వాళ్ల తప్పులు వాళ్లే పెంచుకునే దాక చూస్తా. వాళ్లకు ఇంకా అహంకారం పెరగాలి. నేను ఎవరికీ భయపడను. ఒకరో…
గతంలో ఎవరైనా దళితుల అభివృద్ధి గురించి ఆలోచించారా అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నించారు. హైదరాబాద్ వెస్ట్ మారేడ్‌పల్లిలో దళితబంధు లబ్ధిదారులకు వాహనాలు పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రధాని మోదీ.. హైదరాబాద్ కార్పొరేటర్లను ఢిల్లీకి పిలిచి ఒట్టి చేతులతో పంపారని, నగర అభివృద్ధి కోసం నిధులిస్తే ప్రజలకు మేలు జరిగేదని విమర్శించారు. దళితుల సమగ్రాభివృద్ధి కోసమే ప్రభుత్వం దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టిందని, ఆర్ధికంగా ఎంతో వెనుకబడిన దళితులు అభివృద్ధి సాధించాలనేది సీఎం కేసీఆర్ ఆలోచన…
దళిత బంధు పథకంతో రాష్ట్రంలోని దళిత కుటుంబాలు అభివృద్ధి చెందుతాయని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు. శంషాబాద్ దళిత బంధువు పథకం ద్వారా ఎంపికైన 57 మంది లబ్ధిదారులకు 5 కోట్ల 64 లక్షల రూపాయల వాహనాలను పంపిణీ చేశారు. అనంతరం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి, డాక్టర్ అంబేడ్కర్ చిత్రపటాలకు పాలభిషేకం చేశారు. మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజలు ఏమి కోరుకుంటున్నారో పాలకుడిగా ముఖ్యమంత్రి కేసీఆర్ అదే అమలు పరుస్తున్నారని…
బీజేపీ ప్రభుత్వంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ హాట్ ట్వీట్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఉదయం కేటీఆర్ చేసిన ట్వీట్ కి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రీట్వీట్ చేశారు. కౌంటర్ అటాక్ చేశారు. కిషన్ రెడ్డి ట్వీట్ హాట్ టాపిక్ అవుతోంది. టీఆర్ఎస్ పాలనలో “ఇంటికో ఉద్యోగం లేదు” “నిరుద్యోగ భృతి లేదు” “ఉచిత ఎరువులు లేదు” “ఋణమాఫీ లేదు” “దళిత ముఖ్యమంత్రి లేదు” “దళితులకు మూడెకరాల భూమి లేదు” “పంటనష్ట పరిహారం లేదు” “దళితబంధు లేదు”…
తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న వివిధ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. రంగారెడ్డి జిల్లాలో దళిత బంధు లబ్ధిదారులకు వాహనాలు అందిస్తూ ట్రాక్టర్, కారు నడిపారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. రంగారెడ్డి జిల్లాలో దళిత బంధు పథకంలో ఎంపికైన లబ్ధిదారులకు సరూర్ నగర్ లోని విక్టోరియా మెమోరియల్ హోమ్ గ్రౌండ్ లో జరిగిన యూనిట్ల పంపిణీ కార్యక్రమానికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మూసీ రివర్ ఫ్రంట్ చైర్మన్ సుధీర్ రెడ్డి, జడ్పీ…
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వంపై మండిపడ్డారు మంత్రి కేటీఆర్. తెలంగాణ ప్రభుత్వం తెస్తున్న పథకాలను మోడీ సర్కార్ కాపీ కొడుతోందని, దళిత బంధుని కూడా కాపీ కొడతారేమోనన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన దళిత బంధు చెక్కులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.5 65 ఏళ్ళలో కాని పనులు ఎన్నో ఆరు ఏళ్ళలో చేసుకున్నాం అన్నారు. రైతులకు పెట్టుబడి సాయంతో పాటు రైతు చనిపోతే వారి కుటుంబాలకు రైతు బీమా ఇస్తూ అండగా…
అందరికీ బీఆర్ అంబేద్కర్ 131 జయంతి శుభాకాంక్షలు తెలిపారు మంత్రి కేటీఆర్. బలహీనవర్గాల కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక పథకాలు చేపట్టిందన్నారు. బలహీనవర్గాల కోసం బలంగా నిలబడే వ్యక్తి కేసీఆర్ ఒక్కరే అన్నారు. ప్రపంచంలోనే 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని హైద్రాబాద్ లో పెట్టబోతున్నామన్నారు. భారత దేశంలో ఎవరూ చేయని విధంగా దళితుల కోసం లో టీ- ప్రైడ్ కార్యక్రమం ఏర్పాటు చేశాం. రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిదీ. ఆర్టికల్ 3 ప్రకారం తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది.…
బంధుప్రీతితో ఆ ఎమ్మెల్యే అడ్డంగా బుక్కయ్యారా? విషయం బయటకు రాగానే ప్రత్యర్థులు రచ్చ రచ్చ చేసేశారా? దిద్దుబాటు చర్యలు చేపట్టినా అధికారపార్టీ శాసనసభ్యుడు ఇరుకున పడ్డారా? పార్టీ అధిష్ఠానం యాక్షన్ ఏంటి? దళితబంధు పథకంలో బంధుప్రీతితాటికొండ రాజయ్య. స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే. అధికారపార్టీ శాససభ్యుడు. మాజీ డిప్యూటీ సీఎం. ఇన్ని ట్యాగ్‌లైన్లు ఉన్న ఎమ్మెల్యే రాజయ్య.. దళితబంధు విషయంలో లటుక్కున దొరికిపోయారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఈ పథకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి అమలు చేస్తుంటే.. ఎమ్మెల్యే చేసిన…
సీఎం కేసీఆర్ ప్రారంభించిన దళిత బంధు అనేది ఒక్క ఆర్ధిక సహాయం కాదు, దళితుల అభ్యున్నతి కోసం ప్రారంభించిన ఒక్కఉద్యమం అన్నారు మంత్రి హరీష్ రావు. వారి జీవితాలు వెలుగులు నింపాలనేది సీఎం కేసీఆర్ ఆశయం. దళితబంధు ద్వారా ఆర్ధిక సహాయం అందించడమతో పాటుగా వ్యాపారాభివృద్ధికి ప్రభుత్వ అధికారులు సహకరిస్తారు. నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కూడా 21 శాతం రిజర్వేషన్ దళితులకు కల్పించడం జరిగిందన్నారు. వైన్ షాప్ లో కూడా దళితులకు రిజర్వేషన్ కల్పించడం జరిగింది.…