తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న దళితబంధు పథకానికి పొలిటికల్‌గా కౌంటర్ ప్రోగ్రామ్‌ని బీజేపీ ప్రారంభించిందా అంటే అవునని అంటున్నారు. ఎందుకంటే కమలదళం తెలంగాణలో దళితాతిథ్యం అనే కొత్త కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా బీజేపీ అగ్రనేతలు దళితుల ఇళ్లకు అతిథులుగా వెళ్లి వాళ్ల ఆతిథ్యాన్ని స్వీకరిస్తున్నారు. ఆయా కుటుంబాలతో కలిసి భోజనాలు చేస్తున్నారు. వాళ్ల కష్టసుఖాలను, బాధలను, సంతోషాలను అడిగి తెలుసుకుంటున్నారు. మీకు పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పిస్తున్నారు. తద్వారా దళితులను బీజేపీకి దగ్గర చేయటానికి…