Akhilesh Yadav: సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) నేత అఖిలేష్ యాదవ్ ఆదివారం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం యోగి ఓ ‘‘చొరబాటుదారుడు’’ అంటూ మండిపడ్డారు. ఆయన ఉత్తరాఖండ్ నుంచి, ఉత్తర్ ప్రదేశ్‌లోకి వచ్చాడని, ఆయన సొంత రాష్ట్రానికి తిరిగి పంపించాలని అన్నారు. రామ్ మనోహర్ లోహియా వర్ధంతి సందర్భంగా ఆదివారం లక్నోలోని లోహియా పార్క్‌లో విలేకరులతో మాట్లాడుతూ, బీజేపీ వద్ద నకిలీ లెక్కలు ఉన్నాయని, వాటిని నమ్మితే, తప్పిపోతారని అన్నారు.