Today (18-01-23) Business Headlines: హైదరాబాదులో పెప్సికో విస్తరణ: అమెరికన్ మల్టీ నేషనల్ ఫుడ్ కంపెనీ పెప్సికో హైదరాబాదులో కార్యకలాపాలను విస్తరించనుంది. ఏడాదిన్నర లోపు 12 వందల మందికి ఉద్యోగాలు ఇవ్వనుంది. 2019లో 250 మందితో ప్రారంభమైన పెప్సికో గ్లోబల్ బిజినెస్ సర్వీసెస్ సెంటర్ ఇప్పుడు 2 వేల 800 మందితో నడుస్తోంది. విస్తరణతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 4 వేలకు చేరనుంది.
Today (24-12-22) Business Headlines: శ్రీరామ్ ఆల్ ఇన్ ఒన్ ఆర్థిక సేవలు: శ్రీరాం ట్రాన్స్ పోర్ట్ ఫైనాన్స్, శ్రీరాం సిటీ యూనియన్ విలీనమై శ్రీరాం ఫైనాన్స్ లిమిటెడ్ అనే కంపెనీగా ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కస్టమర్లు వివిధ లోన్ల కోసం వేర్వేరు శాఖలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా చర్యలు చేపట్టారు. అన్ని బ్రాంచిల్లో అన్ని రకాల ఆర్థిక సేవలు అందించే ఏర్పాట్లు చేస్తున్నామని సంస్థ ఎండీ అండ్ సీఈఓ వైఎస్ చక్రవర్తి వెల్లడించారు.