మేషం : ఈ రోజు ఈ రాశిలోని ఉద్యోగస్తులు ధన ప్రలోభాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తుల సహాయం అందుతుంది. కపటంలేని మీ ఆలోచనలు, సలహాలు మీకు అభిమానుల్ని సంపాదించి పెడుతుంది. ప్రముఖులతో సంభాషించేటపుడు మెళకువ వహించండి. దైవ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. వృషభం : ఈ రోజు ఈ రాశిలోని ఏజెంట్లకు, బ్రోకర్లకు ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది. స్పెక్యులేషన్, పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. వాహన చోదకులకు ఆటంకాలు తప్పవు.…