జనవరి 11, మంగళవారం దినఫలాలు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మేషం : ఈ రోజు ఈ రాశిలోని ఉద్యోగస్తులు ధన ప్రలోభాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తుల సహాయం అందుతుంది. కపటంలేని మీ ఆలోచనలు, సలహాలు మీకు అభిమానుల్ని సంపాదించి పెడుతుంది. ప్రముఖులతో సంభాషించేటపుడు మెళకువ వహించండి. దైవ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు.
వృషభం : ఈ రోజు ఈ రాశిలోని ఏజెంట్లకు, బ్రోకర్లకు ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది. స్పెక్యులేషన్, పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. వాహన చోదకులకు ఆటంకాలు తప్పవు. ఖర్చులు అధికమవుతాయి. దూర ప్రయాణాలలో మెళుకువ అవసరం. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. నిరుద్యోగ యత్నాలు ఫలిస్తాయి.
Also Read
- Astrology: సెప్టెంబర్ 24 గురువారం దినఫలాలు.. ఈ రాశివారు పట్టిందల్లా బంగారమే..!
- Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. నేడు ఆ రాశుల వారికి లాభాలే లాభాలు!
- Tuesday Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు ఒకటి రెండుసార్లు ఆలోచించడం మంచిది!
- Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ నాలుగు రాశుల వారికి నేడు పట్టిందల్లా బంగారమే!
మిధునం : ఈ రోజు ఈ రాశిలోని వస్త్ర, ఫ్యాన్సీ, పచారి వ్యాపారులకు ఆశాజనకం. కోర్టు వ్యవహారాలు, భూవివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. స్త్రీలు కళాత్మక పోటీల్లో రాణిస్తారు. ఉద్యోగస్తులకు పైఅధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. మీ విలువైన వస్తువులు, పత్రాలు జాగ్రత్త. ప్రముఖులతో పరిచయాలు ఉపకరిస్తాయి.
కర్కాటకం : ఈ రోజు ఈ రాశిలోని కాంట్రాక్టర్లకు ఇంజనీరింగ్ అధికారుల నుంచి ప్రతికూలతలెదురవుతాయి. మీ సంతానం ఆరోగ్యంలో మెలకువ వహించండి. మీ వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఆలయ సందర్శనాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఒక సమాచారం సేకరణకు శ్రమాధిక్యత, ప్రయాసలెదుర్కుంటారు.
సింహం : ఈ రోజు ఈ రాశిలోని ఉద్యోగస్తులకు ప్రత్యేక ఇంక్రిమెంట్లు, పదోన్నతి వంటి శుభపరిణామాలుంటాయి. భాగస్వామిక చర్చల్లో ఏకాగ్రత వహించండి. కొంత మంది వ్యక్తులు మీ పలుకుబడిని స్వార్థానికి వినియోగించుకుంటారు. దంపతుల మధ్య అనురాగవాత్సల్యాలు పెంపొందుతాయి. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించటం వల్ల ఆర్థిక ఇబ్బందులుండవు.
కన్య : ఈ రోజు ఈ రాశిలోని విద్యార్థులకు ధ్యేయం పట్ల ఏకాగ్రత, కొత్త విషయాల పట్ల ఆసక్తి ఏర్పడతాయి. గృహ నిర్మాణాలు, మార్పులు, చేర్పులు చేపడతారు. స్త్రీలు ఆధిపత్యం చెలాయించి భంగపాటుకు గురవుతారు. నూతన పెట్టుబడులు, లీజు, ఏజెన్సీలు, కాంట్రాక్టులకు సంబంధించిన విషయాల్లో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది.
తుల : ఈ రోజు ఈ రాశివారు లీజు, నూతన పెట్టుబడులు, కాంట్రాక్టులకు సంబంధించిన విషయాల్లో ఏకాగ్రత వహించండి. మీ దైనందిన కార్యక్రమాల్లో మార్పులుండవు. ఖర్చులు అధికం కావటంతో రుణయత్నాలు, చేబదుళ్ళు తప్పవు. నిరుద్యోగులు ఇంటర్వ్యూలకు హాజరవుతారు. నిర్మాణ పనుల్లో పనివారల తీరు నిరుత్సాహం కలిగిస్తుంది.
వృశ్చికం : ఈ రోజు ఈ రాశివారు వస్త్రాలు, గృహోపకరణాలు అమర్చుకుంటారు. దైవ, సాంఘిక కార్యక్రమాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. బ్యాంకు పనులు అనుకూలం. ఎల్.ఐ.సి, పోస్టల్ ఏజెంట్లకు శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. ఒక వ్యవహారం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణం చేయవలసి వస్తుంది.
ధనస్సు : ఈ రోజు ఈ రాశివారు విదేశీయానం కోసం చేసే యత్నాలలో ఆటంకాలు ఎదుర్కుంటారు. కొత్తగా చేపట్టిన వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. స్త్రీలకు ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు అవసరం. భూ వివాదాలు, కోర్టు వ్యవహారాలు ఆందోళన కలిగిస్తాయి. మీ యత్నాలకు సన్నిహితులు అండగా నిలుస్తారు. ఆలయాలను సందర్శిస్తారు.
మకరం : ఈ రోజు ఈ రాశివారు భాగస్వామిక చర్చలు, వాణిజ్య ఒప్పందాలు వాయిదా వేయటం క్షేమదాయకం. ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. పత్రిక, నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. విందులు, వినోదాల్లో హుందాగా మెలిగి అందరినీ ఆకట్టుకుంటారు. బంధు మిత్రులతో ఆంనందంగా గడుపుతారు.
కుంభం : ఈ రోజు ఈ రాశిలోని స్త్రీలు భేషజాలు పోకుండా పరిస్థితులకు అనుగుణంగా మెలగవలసి ఉంటుంది. నూతన వస్తుప్రాప్తి, వస్త్రలాభం వంటి శుభఫలితాలుంటాయి. మీ మాటకు ఇంటా బయట ఆదరణ లభిస్తుంది. కార్యసాధనలో ఆటంకాలు తొలగిపోతాయి. మీ సంతానం విద్యావిషయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు.
మీనం : ఈ రోఉ ఈ రాశివారు తల పెట్టిన పనులు వాయిదా వేయవలసి వస్తుంది. ఖర్చులు, ఇతరత్రా చెల్లింపులు భారీగా ఉంటాయి. విద్యార్థులలో నూతనోత్సాహం చోటుచేసుకుంటుంది. ప్రముఖుల ఇంటర్వ్యూ అనుకూలించి మీసములు సానుకూలమవుతాయి. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. స్వల్ప చికాకులు మినహా సమస్యలు పెద్దగా ఉండవు.
తాజావార్తలు
-
Comrade Kalyan : ‘కామ్రేడ్ కళ్యాణ్’ వాయిదా ?
-
Mahadev Betting App Case: మహదేవ్ కేసులో బిగ్ అరెస్ట్.. ఎయిర్‌పోర్టులోనే పట్టివేత.!
-
Saudi Warning: మక్కాకు ప్రమాదం పొంచి ఉంది.. సౌదీ హెచ్చరిక జారీ
-
Rahul Gandhi: ‘జ్ఞానేశ్ కుమార్ దేశద్రోహి’.. CECపై రాహుల్ సంచలన ఆరోపణలు
-
Best Captain: కపిల్, ధోనీ, కోహ్లీ, రోహిత్.. నలుగురిలో బెస్ట్ కెప్టెన్ ఎవరో తేల్చేసిన యువరాజ్ సింగ్ తండ్రి..
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!