మేషం : ఈ రోజు ఈ రాశిలోని స్త్రీలకు ఆర్జన పట్ల ఆసక్తి, అందుకు తగిన ప్రోత్సాహం లభిస్తుంది. పెరిగిన ధరలు, ఆకస్మిక ఖర్చుల వల్ల ఆటుపోట్లు తప్పవు. చేపట్టిన పనుల్లో ఆటంకాలెదురైనా మొండిగా పూర్తి చేస్తారు. గృహంలో ఏదైనా వస్తువు కనిపించకుండా పోయే ఆస్కారం ఉంది. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాల్లో ఒత్తిడి, చికాకులు తప్పవు. వృషభం : ఈ రోజు ఈ రాశివారు స్థిరాస్తి అమ్మకానికై చేయు యత్నం విరమించుకోవటం మంచిది. ఆలయ సందర్శనాలలో చురుకుగా…