మేషం : ఈ రోజు ఈ రాశిలోని పోర్టు, ట్రాన్సుపోర్టు రంగాల వారికి పురోభివృద్ధి. ముఖ్య వ్యవహారాలను మరింత వేగవంతం చేస్తారు. కలప, ఐరన్, సిమెంటు, ఇటుక, ఇసుక వ్యాపారులకు మిశ్రమ ఫలితం. స్త్రీలకు విలాస వస్తువులపట్ల ఆసక్తి పెరుగుతుంది. భాగస్వామిక వ్యాపారాలు, జాయింట్ వెంచర్లకు సంబంధించిన వ్యవహారాలు అనుకూలిస్తాయి. వృషభం : ఈ రోజు ఈ రాశిలోని రాజకీయ నాయకులకు ప్రయాణాలలో మెళుకువ అవసరం. స్త్రీలకు పనివారితో ఇబ్బందులు తప్పవు. ఉద్యోగస్తులకు సహోద్యోగులతో, అపరిచిత వ్యక్తుల…