దేశంలో వేగంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నది. గత రెండు మూడు రోజులుగా రోజుకు కోటి వరకు వ్యాక్సినేషన్లను అందిస్తున్నారు. ఆర్హులైన ప్రతి ఒక్కరూ తప్పకుండా వ్యాక్సిన్ తీసుకోవాలని ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు హెచ్చరించింది. సెకండ్ వేవ్ నుంచి దేశం ఇంకా పూర్తిగా కోలుకోకపోవడంతో వ్యాక్సిన్ తీసుకున్నా కరోనా నిబంధనలు పాటించాలని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి. దేశంలో వ్యాక్సిన్ కొరత లేదని, అన్ని రాష్ట్రాలకు వ్యాక్సిన్లను అందిస్తున్నామని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది. ఇప్పటి వరకు దేశంలో 66…