రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ తన పుట్టినరోజు (ఆగస్ట్2)ను గన్నవరంలోని డ్యాడీస్ హోమ్ అనాథాశ్రమంలో జరుపుకున్నారు. రెండు దశాబ్దాలుగా దక్షిణాది, బాలీవుడ్ చిత్రాలకు సంగీతాన్ని అందిస్తూ మ్యూజిక్ డైరెక్టర్‌గా తనదైన గుర్తింపును సంపాదించుకున్న దేవిశ్రీ ప్రసాద్ ఈ ఏడాది పుట్టినరోజు వేడుకలకు అనాథ పిల్లలతో కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా ఈ నెలలో ఆ పిల్లల నిర్వహణకు అయ్యే నిత్యావసర సరుకులను అందించారాయన. ‘ ‘వందలాది చిన్నారులకు శ్రద్ధతో, నిస్వార్ధంగా డ్యాడీస్ హోమ్‌వారు చేస్తున్న…