సూపర్ స్టార్ రజనీకాంత్ ఆదివారం అక్టోబర్ 25 తనకు చాలా ప్రత్యేకమని ప్రకటించారు. రేపు న్యూఢిల్లీలో ఆయన ప్రతిష్టాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకోనున్నారు. అలాగే రజిని రెండవ కుమార్తె సౌందర్య విశగన్ రజనీకాంత్ వాయిస్‌తో ఒక కొత్త యాప్‌ను విడుదల చేయనున్నారు. అవార్డు ప్రదానోత్సవం కోసం రజనీకాంత్ రేపు న్యూఢిల్లీకి వెళ్లనున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా తన జీవితంలో అక్టోబర్ 25 ప్రత్యేక రోజు అని వెల్లడించారు రజినీకాంత్. “రేపు (అక్టోబర్ 25) నాకు రెండు ప్రత్యేక ల్యాండ్‌మార్క్‌లతో కూడిన ముఖ్యమైన సందర్భం.
Read Also : మోడీకి కృతజ్ఞతలు… దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుపై రజినీకాంత్ స్పందన
ఒకటి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు. ప్రజల ప్రేమ, సపోర్ట్ కారణంగా నాకు భారత ప్రభుత్వం ప్రదానం చేస్తుంది. ఇక రెండవది… నా కుమార్తె సౌందర్య విశాగన్ తన సొంతంగా రూపొందించిన “HOOTE” అనే ఉపయోగకరమైన యాప్‌ను భారతదేశం నుండి ప్రపంచానికి పరిచయం చేయబోతోంది. ఇందులో ప్రజలు వారి వాయిస్ ద్వారా ఆలోచనలను పంచుకోవచ్చు. ఈ వినూత్నమైన, ఉపయోగకరమైన, ఈ రకమైన మొట్టమొదటి “HOOTE APP”ని నా వాయిస్ తో ప్రారంభించడం నాకు చాలా సంతోషంగా ఉంది ” అంటూ రేపు తన జీవితంలో జరగనున్న రెండు ముఖ్యమైనసందర్భంగా గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు రజినీ.