బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా పదేళ్ల క్రితం తన 19వ ఏట ‘సింగ్ సాబ్ ది గ్రేట్’ మూవీతో ఎంట్రీ ఇచ్చింది. స్కిన్‌షోకు తెరలేపినా ఈఅమ్మడికి వచ్చిన ఆఫర్స్ అంతంత మాత్రమే. తెలుగులో ఎంట్రీ ఇచ్చిన మూడేళ్లల్లో ఐదు సినిమాలు చేసింది. ఊర్వశి రతౌలా బ్లాక్ రోజ్ సినిమాలోని ఐటంసాంగ్‌తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. అయితే బ్లాక్ రోజ్ మూవీలో ఐటంసాంగ్ చేసిన సంగతే తెలీదు. ఆ సినిమా తర్వాత తెలుగులో అంతగా అవకాశాలు రాలేదు…