నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ డైరెక్ట్ చేసిన డాకు మహారాజ్ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాని త్రివిక్రమ్ భార్య సాయి సౌజన్యతో కలిసి నాగ వంశీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పించిన ఈ సినిమా మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. నందమూరి బాలకృష్ణని ఇప్పటివరకు చూపించని విధంగా బాబీ చూపించాడు అంటూ బాబీ మీద ప్రశంసల వర్షం…