బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు.. పరేడ్ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభ తర్వాత తెలంగాణలో వరస కార్యక్రమాలకు ప్లాన్ చేస్తున్నారు కమలనాథులు. హైదరాబాద్‌లో మీటింగ్స్ ముగిసిన 24 గంటల్లోనే మూడు కమిటీలు ప్రకటించి తమ దూకుడేంటో తెలియజెప్పారు. వీటిల్లో చేరికల కమిటీ పెద్ద చర్చకే దారితీస్తోంది. మొన్నటి వరకు ఆ చేరికల కమిటీకి బీజేపీ సీనియర్ నేత ఇంద్రసేనారెడ్డి నేతృత్వం వహించారు. తాజాగా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సారథ్యంలో చేరికల కమిటీని సిద్ధం చేసింది ఢిల్లీ నాయకత్వం.…
బీజేపీ నేత డీకే అరుణ సంచలన కామెంట్స్ చేశారు. టీఆర్ఎస్ పార్టీ ముందస్తు ఎన్నికలకు సిద్ధం అవుతోందని ఆమె అన్నారు. ప్రజలకు ఇచ్చిన హమీలను కేసీఆర్ తుంగలో తొక్కి మరోసారి ఎన్నికల్లో ప్రజలను మోసగించేందికు సిద్దమవుతున్నాడని విమర్శించారు. రాష్ట్రంలో బలపడుతున్న బీజేపీని అడ్డుకునేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా,సంక్షేమ పథకాలను ప్రజలకు కార్యకర్తలు విధిగా తెలియజేయాలని సూచించారు. ఆయుష్మాన్ భారత్ పథకాన్ని తెలంగాణలో అమలు చేయకపోవడంతో పేదలు వైద్యం కోసం ఇబ్బంది పడుతున్నారని…