Goa Blast: గోవా రాష్ట్రం అర్పోరా ప్రాంతంలోని ఒక రెస్టారెంట్-కమ్-నైట్ క్లబ్ అర్ధరాత్రి భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. సెకన్లలోనే, మంటలు వ్యాపించాయి. అక్కడున్న సిబ్బంది, కస్టమర్లు పారిపోవడానికి సైతం అవకాశం లభించలేదు. ఎగసిపడుతున్న మంటలు మొత్తం ప్రాంతాన్ని సర్వనాశనం చేశాయి. ఈ సంఘటనలో మరణాల సంఖ్య ఇరవై ఐదు మందికి చేరింది. వీరిలో 22 మంది ఊపిరాడక, ముగ్గురు సజీవ దహనం అయ్యారు. ఎమ్మెల్యే మైఖేల్ లోబో ఈ సంఘటనను చాలా విషాదకరంగా అభివర్ణించారు.…