Cyclone Montha: తీరం దాటిన మొంథా తుఫాన్ ఎఫెక్ట్‌తో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.. తీర ప్రాంతాల జిల్లాలో విధ్వంసం సృష్టించిన మొంథా.. మిగతా జిల్లాల్లోనూ తీవ్ర పంట నష్టాన్ని మిగిల్చింది.. ఇక, తుఫాన్ ప్రభావంతో.. ఈస్ట్ కోస్ట్, సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో పెద్ద సంఖ్యలో రైళ్లను పూర్తిగా రద్దు చేయాల్సిన పరిస్థితి.. కొన్ని రైళ్లను దారి మళ్లించగా.. కోస్తా ప్రాంతాలు.. విజయవాడ మీదుగా నడవాల్సిన చాలా రైళ్లను రద్దు చేశారు.. ఈ నేపథ్యంలో…
Cyclone Montha: తుఫాన్ బాధితులకు ఆర్థిక సాయం ప్రకటించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గంలోని ఓడలరేవు గ్రామంలో తుఫాన్ పునరావాస కేంద్రాలను సందర్శించిన సీఎం చంద్రబాబు.. పునరవాస కేంద్రాలలో ప్రజలతో మాట్లాడారు.. ప్రజలకు నిత్యవసరాలతో పాటు బియ్యం కూడా అందజేసినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు… అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని తుఫాన్ ఎఫెక్ట్ తో ప్రాణనష్టం జరగకుండా అర్ధరాత్రి వరకు మానిటర్ చేశాం.. వరి పంట కొంతవరకు…
Hunt for Gold at Uppada Beach: కాకినాడ జిల్లాలోని ఉప్పాడ సముద్ర తీరానికి మరోసారి భారీ సంఖ్యలో తరలివచ్చారు ప్రజలు.. బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుఫాన్ కాకినాడ – మచిలీపట్నం మధ్య అంతర్వేదిపాలెం సమీపంలో తీరాన్ని తాకింది.. ఆ తర్వాత బలమైన తుఫాన్‌గా కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.. కొన్ని ప్రాంతాలు అతలాకుతలం అయ్యాయి.. భారీ నష్టాన్ని చవి చూడాల్సి వచ్చింది.. కానీ, యథావిధిగా ఈ…
CM Chandrababu Aerial Survey: మొంథా తుఫాన్ ఆంధ్రప్రదేశ్‌పై తీవ్ర ప్రభావం చూపిస్తోంది.. బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుఫాన్ కాకినాడ – మచిలీపట్నం మధ్య అంతర్వేదిపాలెం సమీపంలో తీరాన్ని తాకింది. ఆ తర్వాత బలమైన తుఫాన్‌గా కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే, తుఫాన్ కారణంగా దెబ్బతిన్న కోనసీమలోని తీరప్రాంతాలలో ఏరియల్ సర్వే నిర్వహించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఓడలరేవు ఓఎంజీసీ టెర్మినల్ కు చేరుకున్న…
మెంథా తుఫాన్ ఎఫెక్ట్ తో ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా తెలంగాణాలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం నుంచి మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు చోట్ల రైళ్లను కూడా రద్దుచేశారు. నిన్న రాత్రి ఆంధ్రప్రదేశ్ లోని అంతర్వేదిపాలెంద దగ్గర మెంథా తుఫాన్ తీరాన్ని తాకింది. దీంతో రాబోయే రెండు రోజుల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావారణ శాఖ తెలిపింది. దీంతో తెలంగాణలో పలు జిల్లాల్లోని…
మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల పర్యటనకు సీఎం చంద్రబాబు నాయుడు బయల్దేరారు. ముఖ్యమంత్రి హెలికాప్టర్ ద్వారా ఏరియల్ విజిట్ చేయనున్నారు. బాపట్ల, పల్నాడు, కృష్ణా, కోనసీమ, ఏలూరు జిల్లాల్లో సీఎం చంద్రబాబు ఏరియల్ విజిట్ చేస్తారు. చిలకలూరిపేట, పర్చూరు, చీరాల, కోడూరు, నాగాయలంక మీదుగా ఓడలరేవు వరకు విజిట్ చేయనున్నారు. కోనసీమ జిల్లా, అల్లవరం మండలం ఓడలరేవులో సీఎం ల్యాండ్ అవనున్నారు. ఓడల రేవు నుంచి రోడ్డు మార్గాన ప్రయాణించి వర్షాలకు నీట మునిగిన పంట పొలాలను…
‘మొంథా’ తుఫాన్ ప్రభావంతో ఏపీలోని అన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. కృష్ణా జిల్లాలో తుఫాన్ బీభత్సం సృష్టించింది. తుఫాన్ బీభత్సంతో కృష్ణా జిల్లాలో నిలిచిన విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడానికి విద్యుత్ శాఖ అధికారులు వర్షంలో కూడా మరమ్మతులు చేపట్టారు. మచిలీపట్నం, పెడన, అవనిగడ్డ, గుడివాడ ప్రాంతాల్లో భారీగా మరమ్మత్తు పనులు చేపట్టారు. జిల్లాలో సుమారు 4 కోట్ల వరకు నష్టం వచ్చినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. వీలైనంత త్వరగా విద్యుత్ సరఫరా పునరుద్ధరణ చేస్తామని అధికారులు…
తెలుగు రాష్ట్రాల్లో ‘మొంథా’ తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. ముఖ్యంగా ఏపీపై ప్రభావం చూపుతోంది. తుఫాన్ ప్రభావంతో అన్ని జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దాంతో వాగులు, వంకలు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. భారీ వరదలతో రోడ్లు కొట్టుకుపోయి రాకపోకలు నిలిచిపోయాయి. పలు ప్రాంతాలను వరదనీరు ముంచెత్తింది. వరద నీరుతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు మొంథా తుపాను ప్రభావంతో తెలంగాణలోని పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి.
మొంథా తుఫాన్ ప్రభావంతో విశాఖ తీరం వెంబడి ఈదురు గాలులు బలంగా వీస్తున్నాయి. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. తుఫాన్ ప్రభావంతో విశాఖలో వర్షం మొదలైంది. మొంథా తుఫాను బలహీనపడి.. తీవ్ర అల్పపీడనంగా మారింది. రానున్న 24 గంటలు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. తుఫాను ప్రభావం పూర్తిగా తొలిగేవరకు నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరికలుజారీ చేశారు. మొంథా తుఫాను ప్రభావంతో…