Cyclone Alert: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది. వాయువ్య దిశగా పయనించి రాబోయే 12 గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. ఈ నెల 3వ తేదీ నాటికి తీవ్ర వాయుగుండంగా బలపడే ఛాన్స్. ఉత్తర కోస్తా- దక్షిణ ఒడిస్సా మధ్య తీవ్ర వాయుగుండం తీరం దాటనుంది.
తెలంగాణ రాష్ట్రంలో చలి వణికిస్తోంది. రోజురోజుకు పడిపోతున్న ఉష్ణోగ్రతలతో జనాలు బయటకు రావడానికి జంకుతున్నారు. సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొద్దిరోజులుగా చలి తీవ్రత కాస్త తగ్గిడంతో ఊపిరి పీల్చుకున్న రాష్ట్ర ప్రజలకు మళ్లీ చలి గజగజ వణికిస్తోంది.