అనంతపురంలో డిజిటల్ అరెస్టు పేరున డబ్బు డిమాండ్ చేసిన సైబర్ కేటుగాడిని రిటైర్డ్ ఉద్యోగి ధైర్యంగా ఎదుర్కొన్నాడు. ఫోన్ చేసింది డిజిటల్ మోసగాడు అని గ్రహించిన రిటైర్డ్ ఉద్యోగి నారాయణ రెడ్డి నేరుగా అనంతపురం టు టౌన్ పోలీసులను ఆశ్రయించారు.. దీంతో డిజిటల్ నెరస్తుడి నుంచి తప్పించుకున్నాడు. ధైర్యంగా ఎదుర్కొన్న నారాయణ రెడ్డిని అనంతపురం టు టౌన్ సీఐ శ్రీకాంత్, సైబర్ క్రైం సీఐ జాకీర్ లు అభినందించారు.