ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నివాసం దాడి ఘటనపై కేంద్ర హోం శాఖకు ఫిర్యాదు చేస్తామని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. సైబరాబాద్ సీపీ కార్యాలయానికి వచ్చిన బీఆర్ఎస్ నేతలు.. జాయింట్ సీపీకిఫిర్యాదు చేశారు. సీపీ లేకపోవడంతో జాయింట్ సీపీకి బీఆర్‌ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి లిఖిత పూర్వక ఫిర్యాదు రాసి ఇచ్చారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. దాడికి సహకరించిన పోలీసులను కూడా సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఉద్దేశ…
సైబరాబాద్ సీపీ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. కౌశిక్ రెడ్డి నివాసం దాడి ఘటనపై ఫిర్యాదు చేసేందుకు హరీష్‌రావు, బీఆర్‌ఎస్ నేతలు సీపీ ఆఫీస్‌కు వెళ్లారు. సీపీ ఆఫీస్‌లోకి ముగ్గురు ఎమ్మెల్యేలకు అనుమతి ఇచ్చారు. దీంతో.. ఎమ్మెల్యేలందరినీ అనుమతించాలంటూ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు.