అమెరికాలో వీట్స్ బిజినెస్ పేరుతో సైబర్ మోసం జరిగింది. అధిక లాభాలు వస్తాయని నమ్మించి నేరగాళ్లు 2.1 కోట్లను కాజేశారు. హైదరాబాద్‌కు చెందిన ఓ బాధితుడిని సైబర్ కేటుగాళ్ళు భారీగా మోసం చేశారు.
Cyber Crime : ఉత్తరప్రదేశ్‌లో పీజీఐ లక్నోకు చెందిన డాక్టర్ రుచికా టాండన్‌ను 6 రోజుల పాటు డిజిటల్ అరెస్ట్ చేసి రూ.2.8 కోట్లు మోసం చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది.
తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) తెలంగాణ రాష్ట్రంలో గత ఐదు నెలల్లో వివిధ సైబర్ మోసాల బాధితులకు రూ.85.05 కోట్లు తిరిగి అందించింది. TGCSB డైరెక్టర్ శిఖా గోయెల్ మాట్లాడుతూ TGCSB , తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (TGLSA) మధ్య సహకార ప్రయత్నమే ఫలితం అని అన్నారు. ఈ ప్రయత్నాలు పెరుగుతున్న సైబర్ నేరాల వెనుక గల కారణాలను , నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (NCRP) ద్వారా ఫస్ట్ ఇన్ఫర్మేషన్…
నిమ్స్ ఆస్పత్రిలో సైబర్ మోసానికి గురయ్యారు నిమ్స్ ఫైనాన్స్ సెక్రటరీ. నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప పేరుతో ఓ సైబర్ మోసగాడు డబ్బులు వసూలు చేస్తున్నాడు. డాక్టర్ బీరప్ప ఫోటోని డీపీగా పెట్టి తాను ఒక మీటింగ్ లో ఉన్నానని అర్జెంటుగా రూ. 50 వేలు పంపాలని బీరప్ప పేరుతో ఫైనాన్స్ కంట్రోలర్ కి వాట్సాప్ మెసేజ్ పంపించాడు. దాన్ని గుడ్డిగా నమ్మిన నిమ్స్ ఫైనాన్స్ కంట్రోలర్ 50 వేలు తన వద్ద లేకపోయినా వేరే ఇంకొకరి…
రోజురోజుకు కేటుగాళ్లు ముదిరిపోతున్నారు. ఏకంగా.. ఎంపీలు, ఎమ్మెల్యేలను బురిడీ కొట్టిస్తున్నాడో కేటుగాడు… ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అడిషనల్ సెక్రటరీ గా పరిచయం చేసుకుంటూ ఎమ్మెల్యేలు, ఎంపీలకు ఫోన్ కాల్స్ చేయడం మొదలెట్టాడు. ప్రభుత్వం కొత్తగా లోన్ స్కీం తెస్తోందని.. 100 మంది సభ్యులకు లోన్లు అందించబోతోందని చెప్తూ మోసాలకు పాల్పడుతున్నాడు. లోన్ మంజూరు కావాలంటే ఒక్కో వ్యక్తి కి 3600 చొప్పున 3 లక్షల 60 వేలు తాను చెప్పిన అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పిన మోసగాడు..…
Cyber Fraud: సైబర్ నేరగాళ్లు రకరకాలుగా మోసాలకు పాల్పడుతున్నారు. ఇటీవల హైదరాబాద్ నగరంలో ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో ఒకరు, రివార్డ్ పాయింట్ల పేరుతో మరొకరు సైబర్ దాడికి గురై లక్షల రూపాయలను పోగొట్టుకున్నారు.
'హలో... నేను టెలికమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్ నుండి ఫోన్ చేస్తున్నాను. మీ ఫోన్ నంబర్ కొన్ని చట్టవిరుద్ధ కార్యకలాపాలకు ఉపయోగించబడుతోంది. మేము ఈ నెంబర్ ను మూసివేస్తున్నాము. మీరు మీ నంబర్ను కొనసాగించాలనుకుంటే, మేము చెప్పిన వాటిని ధృవీకరించాలి...' అని మోసపూరితమైన కాల్స్ చేస్తుంటారు. ఒకవేళ.. ఈ కాల్ ని అలానే కొనసాగిస్తే మీ అకౌంట్ లో ఉన్న డబ్బును కొట్టేస్తారు. ఇదొక సైబర్ మోసం.. +92 నంబర్ నుండి వినియోగదారుల వాట్సాప్కు కాల్లు వస్తున్నాయి. ఫోన్ చేస్తున్న…
Call Forwarding : పెరుగుతున్న సైబర్ మోసాలను అరికట్టేందుకు కాల్ ఫార్వార్డింగ్ సౌకర్యాన్ని నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం అన్ని టెలికాం కంపెనీలకు టెలికమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్ నుండి ఆదేశాలు ఇవ్వబడ్డాయి.
Cyber Fraud: సైబర్ మోసాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేసి లాటరీ తగిలిందని, లక్కీ డ్రా తీశామని, బంగారు, బంగారు నాణేలు వచ్చాయని చెప్పి మోసాలకు పాల్పడి దరఖాస్తుకు ఓటీపీ ఇవ్వాలని కోరుతున్నారు.