దేశంలో సైబర్ మోసాల కేసులు గణనీయంగా పెరిగాయి. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న నంద్ గోపాల్ గుప్తా నంది సైబర్ మోసానికి గురయ్యారు. సైబర్ నేరగాళ్లు రూ.2 కోట్ల 8 లక్షలు మోసం చేశారు. మంత్రి నంది కుమారుడి పేరుతో సైబర్ దుండగులు అకౌంటెంట్‌ను ట్రాప్ చేసి మోసానికి పాల్పడ్డారు. మోసానికి గురైనట్లు తెలుసుకున్న వెంటనే సైబర్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు.
హైదరాబాద్ నగరంలో ఓ సైబర్ నేరగాడు రెండో పెళ్లి పేరుతో యాభై లక్షల రూపాయలను కాజేసాడు. భర్త చనిపోవడంతో రెండో పెళ్లి కోసం భారత్ మాట్రిమోనీలో జూబ్లీహిల్స్‌కు చెందిన ఓ మహిళ రిజిస్టర్ చేసుకుంది. ఇటలీలో తాను డాక్టర్‌నని, ఇక్కడే క్లినిక్ ఉందని, మాట్రిమోనీ సైట్‌లో ప్రొఫైల్ చూశానని ఆ మహిళను కేటుగాడు నమ్మించాడు. మీకు ఇష్టమైతే పెళ్లి చేసుకొని హైదరాబాద్‌లోనే స్థిరపడదామని ఆ మహిళను కేటుగాడు ముగ్గులోకి లాగాడు. ఇటలీలో ఉన్న తన ఖరీదైన వస్తువులను…