టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ నేరాలు పెరుతున్నాయి.. సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందన్నారు ఆంధ్రప్రదేశ్ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత.. సైబర్ నేరాలపై అవగాహన కల్పించేందుకు విజయవాడలో సైబర్ క్రైమ్ అవగాహన ర్యాలీ నిర్వహించారు.. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బెంజ్ సర్కిల్ వరకూ వాక్ థాన్ జరిగింది.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న హోం మంత్రి అనిత.. సైబర్ సోల్జర్స్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర్…
ఎప్పటికప్పుడు వస్తున్నా కొత్త టెక్నాలజీతో సైబర్ నేరాలు కూడా పెరుగుతున్నాయి. ఈ విషయంలో సైబర్ నేరగాళ్లు కూడా అప్డేట్ అవుతున్నారు. వచ్చిన అవకాశాలు వదులుకోకుండా అమాయకుల్ని బురిడీ కొట్టిస్తున్నారు. సైబర్ నేరాలకు చెక్ పెడుతున్నామని చెపుతున్న పోలీసులకు కొత్త సవాల్ విసురుస్తున్నారు నేరగాళ్లు. బ్యాంకు వివరాలు అంటూ కాల్స్ రావడమే ఆలస్యం.. డబ్బులు కట్ అయిపోతున్నాయంటూ వచ్చే కేసుల సంఖ్య పెరిగిపోతుంది. మరోవైపు మీకు లాటరీ వచ్చిందంటూ ఫోన్ చేసి తీరా వచ్చాక పాలసీలు, డిపాజిట్లు చెల్లించాలి…