నేడు 14వ రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి. క్వశ్చన్ అవర్‌తో సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మహిళలకు ఆర్ధిక సాయం, కృష్ణపట్నం ఓడరేవు నుంచి ఎగుమతి అండ్ దిగుమతి, పశు వైద్యశాలలపై సభ్యుల ప్రశ్నలు అడగనున్నారు. విశాఖ రైతులకు భూ కేటాయింపు, దొనకొండలో పారిశ్రామికవాడ, గుంటూరు మిర్చి యార్డులో అక్రమాలపై ప్రశ్నలు సందించనున్నారు. ఇవాళ సభలో ద్రవ్య వినిమయ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. రెవెన్యు సమస్యలపై ప్రత్యేక చర్చ జరగనుంది. ఉదయం 10 గంటలకు ప్రశ్నోత్తరాలతో శాసనమండలి…