Shiva Re Release : తెలుగు సినిమా హిస్టరీలో ట్రెండ్ సెట్ చేసిన మూవీ ‘శివ’. రిలీజ్ రోజున యూత్ ను విపరీతంగా ఆకట్టుకుంది. దెబ్బకు తిరుగులేని కలెక్షన్లు, రికార్డులు సృష్టించింది. యూత్ లో నాగార్జునకు మాస్ ఫాలోయింగ్ పెంచుతూ.. స్టార్ ఇమేజ్ ను తెచ్చిపెట్టింది. ఆ మూవీ నేడు రీ రిలీజ్ అయింది. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పెషల్ ట్వీట్ చేశారు. ఇప్పటికే చిరంజీవి, రాజమౌళి, ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్ బాబు…
నాగార్జున హీరోగా నటించిన ‘శివ’ ఎన్ని రికార్డులు బద్దలు కొట్టిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘విక్రమ్’ సినిమాతో లాంచ్ అయిన నాగార్జునకి ‘శివ’ సినిమా మాత్రం ఒక సాలిడ్ స్టార్ ఇమేజ్ తెచ్చిపెట్టింది. రామ్ గోపాల్ వర్మ దర్శకుడిగా అరంగేట్రం చేసిన ఈ సినిమాలో హీరోయిన్‌గా అమల నటించింది. కాలేజ్ స్టూడెంట్స్ గొడవల బ్యాక్‌డ్రాప్‌లో రూపొందించిన ఈ సినిమా అప్పట్లోనే ఒక ప్రభంజనం సృష్టించడమే కాదు, ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. Also Read: Athadu :…
ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న కల్ట్ క్లాసిక్ హిట్ చిత్రం అందాల రాక్షసి మరోసారి అలరించడానికి సిద్ధమైంది. ఈ ఎవర్‌గ్రీన్ లవ్ స్టోరీ జూన్ 13, 2025న రీ-రిలీజ్ కానుంది. నవీన్ చంద్ర, రాహుల్ రవీంద్రన్, లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి హను రాఘవపూడి దర్శకత్వం వహించారు. వారాహి చలనచిత్రం బ్యానర్‌పై సాయి కొర్రపాటి, ఎస్.ఎస్. రాజమౌళి నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 10, 2012న విడుదలై ఘన విజయం సాధించింది. Also Read:…
తెలుగు సినిమా పరిశ్రమలో సూపర్‌స్టార్ మహేష్ బాబు నటించిన ‘ఖలేజా’ చిత్రం, సూపర్‌స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా మే 30, 2025న రీ-రిలీజ్ అయి ప్రేక్షకులను ఆకట్టుకుంది. 2010లో విడుదలైన ఈ చిత్రం, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొంది, అప్పట్లో మిశ్రమ స్పందన పొందినప్పటికీ, కాలక్రమేణా కల్ట్ క్లాసిక్‌గా మారింది. ఈ రీ-రిలీజ్‌తో మహేష్ బాబు అభిమానులు ఉత్సాహంతో థియేటర్లకు తరలివచ్చారు. దీంతో సినిమా బాక్సాఫీస్ వద్ద బలమైన ఓపెనింగ్స్‌తో దూసుకెళ్లింది. అయితే, పవన్ కళ్యాణ్ చిత్రం…
తెలుగునాట ‘రాముడు’ అనగానే గుర్తుకు వచ్చేది మహానటుడు నటరత్న యన్.టి.రామారావే! ఇక ‘రాముడు’ టైటిల్స్ లో రూపొందిన అనేక చిత్రాలలోనూ యన్టీఆర్ నటించి అలరించారు. అరవై ఏళ్ళ క్రితం రామారావు అభినయంతో అలరించిన ‘టైగర్ రాముడు’ ఆ కోవకు చెందినదే! జనబాహుళ్యంలో ఉన్న కథలకు సినిమా నగిషీలు చెక్కి చిత్రాలను రూపొందించడం రచయితలకు పరిపాటే! మొక్కై వంగనిది మానై వంగునా అనే సామెతను గుర్తు చేస్తూంది చిత్రం. అలాగే కన్నబిడ్డలను సన్మార్గంలో నడిపించవలసిన బాధ్యత తల్లిదండ్రులదే అన్న…
నవతరం వేగానికి తాము తట్టుకోలేమని చాలామంది పెద్దవారు అంటూ ఉంటారు. నిజమే! ప్రస్తుతం అన్నిటా వేగం పెరిగిపోతోంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ‘ప్రియదర్శని’ని చేతిలో పట్టుకు తిరుగుతున్న రోజులివి. సాంకేతికత పేరుతో ఏళ్ళ తరబడి చలనచిత్రాలను రూపొందిస్తున్న రోజులు కూడా ఇవే! ఓ భారీ జానపదం తెరకెక్కించడానికే రెండు, మూడేళ్ళు తీసుకుంటున్నారు దర్శకులు, నిర్మాతలు. నవీన సాంకేతికతతో వేగం పెరిగిన రోజుల్లోనే ఇన్ని రోజులు అయితే, నలభై ఐదేళ్ళ క్రితం ఓ భారీ పౌరాణిక చిత్రాన్ని రూపొందించడానికి…
తెలుగునాట ఓ హీరో ద్విపాత్రాభినయం చేసిన తొలి చిత్రంగా అన్నపూర్ణ వారి ‘ఇద్దరు మిత్రులు’ను పేర్కొంటూ ఉంటారు. అంతకు ముందు 1950లలోనే తెలుగులో ద్విపాత్రాభినయ చిత్రాలు రూపొందాయి. 1950లో తమిళ హీరో ఎమ్.కె. రాధా ద్విపాత్రాభినయం చేసిన ‘అపూర్వ సహోదరులు’ తొలి డ్యుయల్ రోల్ మూవీ అని చెప్పవచ్చు. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో రూపొందింది. ఇందులో మన భానుమతి కథానాయిక. తెలుగువారయిన సి.పుల్లయ్యనే దర్శకులు. ఆ తరువాత 1953లో ‘చండీరాణి’లో భానుమతి ద్విపాత్రాభినయం చేశారు.…