చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఐపీఎల్ 2025 నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. గాయం కారణంగా రుతురాజ్ 18వ సీజన్ నుంచి వైదొలిగడంతో.. మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ మళ్లీ సీఎస్‌కే సారథ్య బాధ్యతలు చేపట్టాడు. ధోనీ కెప్టెన్సీలో సీఎస్‌కే విజయాలు సాదిస్తుందని అటు మేనేజ్‌మెంట్, ఇటు ఫాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. చివరిసారి ధోనీ సీఎస్‌కే కెప్టెన్‌గా ఉన్నప్పుడు గుజరాత్ టైటాన్స్ జరిగిన ఐపీఎల్ ఫైనల్‌లో చెన్నై విజయం సాధించింది. మహీ…