ఇండియన్ సినిమాల్లో, మరీ ముఖ్యంగా తెలుగు సినిమాల్లో హీరోకి ఎలివేషన్ ఇవ్వాలి అంటే డైలాగులు కూడా సరిపోని సమయంలో మన దర్శకులంతా, హీరోని జంతువులతో పోల్చి ఎలివేట్ చేస్తూ ఉంటారు. ఈ లిస్టులో ఫస్ట్ ప్లేస్ పులికి ఇవ్వాల్సిందే. ఎంతమంది హీరోలని, ఎన్ని సంవత్సరాలుగా, ఎన్ని సినిమాల్లో పులి హీరోని ఎలివేట్ చేసిందో లెక్కేయ్యడం కూడా కష్టమే. హీరో ఎలివేషన్ సీన్ పడాలి అంటే పులి ఉండాల్సిందే లేదా పులి డైలాగ్ అయినా ఉండాల్సిందే అనిపించే రేంజులో…