Telugu Cinema: జంతువులన్నీ అయిపోయాయి… ‘కాకి’ గోల మొదలయ్యింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియన్ సినిమాల్లో, మరీ ముఖ్యంగా తెలుగు సినిమాల్లో హీరోకి ఎలివేషన్ ఇవ్వాలి అంటే డైలాగులు కూడా సరిపోని సమయంలో మన దర్శకులంతా, హీరోని జంతువులతో పోల్చి ఎలివేట్ చేస్తూ ఉంటారు. ఈ లిస్టులో ఫస్ట్ ప్లేస్ పులికి ఇవ్వాల్సిందే. ఎంతమంది హీరోలని, ఎన్ని సంవత్సరాలుగా, ఎన్ని సినిమాల్లో పులి హీరోని ఎలివేట్ చేసిందో లెక్కేయ్యడం కూడా కష్టమే. హీరో ఎలివేషన్ సీన్ పడాలి అంటే పులి ఉండాల్సిందే లేదా పులి డైలాగ్ అయినా ఉండాల్సిందే అనిపించే రేంజులో మన దర్శకులు సినిమాలు చేశారు. రాజమౌళి అయితే పులితో రామ్ చరణ్ తో ఏకంగా మొహం పగలకొట్టించాడు కూడా. ఆర్ ఆర్ ఆర్ సినిమాలో ఈ సీన్ ని సినీ అభిమానులంతా విజిల్స్ వేశారు. ఆ తర్వాత పులి స్థాయిలో వాడిన మరో జంతువు సింహం. ఈ అడివి రాజుని ఎలివేషన్ కోసం మాత్రమే కాదు సినిమా టైటిల్స్ కోసం కూడా వాడేసారు. బాలయ్య లాంటి హీరో సినిమా టైటిల్ లో ‘సింహా’ అనే పదం ఉంటే చాలు నందమూరి అభిమానులకి పూనకలు వస్తాయి. పులి, సింహం లాంటి క్రూర జంతువులు అయిపోయాక మన ఫిల్మ్ మేకర్స్ కి ‘ఈగల్’ దొరికింది. ‘ది ఈగల్ ఈజ్ కమింగ్’ అంటూ హీరో క్యారెక్టర్ కి కాస్త తెలివితేటలు ఉంటే చాలు ఈగల్ ని వాడేసారు. మధ్యలో పీరియాడిక్ డ్రామా జానర్ లో తెరకేక్కే సినిమాల కోసం గురాన్ని కూడా గట్టిగానే వాడారండోయ్.
మెగా హీరోలని ఎలివేట్ చెయ్యడానికి గుర్రపుస్వారీలు ఉపయోగ పడినంత మరో జంతువు ఉపయోగ పడలేదు. మెగాస్టార్ నుంచి పవర్ స్టార్, మెగా పవర్ స్టార్ వరకూ ప్రతి ఒక్కరూ గుర్రం ఎక్కిన వారే. ఇలా సినిమాల్లో ఎదో ఒక చోట జంతువులని వాడి హిట్ కొట్టడం మన ఫిల్మ్ మేకర్స్ కి బాగా అలవాటైన పని. పులి, సింహం, గుర్రం, ఈగల్ లాంటివి అయిపోయిన తర్వాత ఫిల్మ్ మేకర్స్ దృష్టి ఇప్పుడు ‘కాకి’పైన పడినట్లు ఉంది. బలగం సినిమా మొత్తం కాకి చుట్టే తిరిగింది, దసరా సినిమాలో కూడా కాకి ప్రెజెన్స్ ఉంది. ఇక లేటెస్ట్ గా సాయి ధరమ్ తేజ్ నటించిన ‘విరుపాక్ష’ సినిమాలో కూడా ‘కాకి’ చాలా కీ రోల్ ప్లే చేసింది. ఎవరైనా చనిపోతే, వారికి పిండం పెట్టడం మన ఆచారం. ఈ సమయంలో కాకి వచ్చి ఆ పిండం తింటే చనిపోయిన వారి ఆత్మకి శాంతి చేకూరినట్లు అని మనం భావిస్తూ ఉంటాం. ప్రస్తుతం తెలుగు సినిమాల్లో కాకి ఈ పాత్రమే ప్లే చేస్తుంది. మరి ఈ కాకి ట్రెండ్ తెలుగు సినిమాల్లో ఎన్ని రోజులు ఉంటుందో, ఈ హ్యాట్రిక్ సెంటిమెంట్ ఇంకెన్ని సినిమాలకి పాకుతుందో చూడాలి.
Also Read
- Vintara Saradaga Release Date: నూతన సంవత్సర కానుకగా గౌరీ ప్రియ ‘వింటారా సరదాగా’!
- Keerthy Suresh: వెరీ టఫ్ కాంపిటీషన్.. మరోసారి రిస్క్ చేస్తోన్న 'మహానటి'!
- Dhurandhar 2 vs Ramayan: 'ధురంధర్ 2' వర్సెస్ 'రామాయణ'.. రెండో శుక్రవారం కలెక్షన్లలో టాప్ మూవీ ఏదంటే?
- Chiranjeevi: 'మెగాస్టార్' ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా!
తాజావార్తలు
-
IND vs NZ Test: టెస్ట్ స్క్వాడ్‌లోకి యువ పేసర్.. కుల్దీప్ యాదవ్‌ను ఎందుకు తప్పించారంటే?
-
Mekedatu Dam Row: కాంగ్రెస్ నేతల మధ్యే మెకెదాటు డ్యామ్ వార్.. కర్ణాటక సీఎంపై తమిళనాడు ఎంపీ ఫైర్!
-
Vaibhav Sooryavanshi: ప్రపంచంలోనే అత్యంత పిన్న కెప్టెన్.. 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ చరిత్ర!
-
EPFO Alert: ప్రైవేట్ ఉద్యోగులూ తెలుసుకోండి.. PF విషయంలో EPFO కొత్త అప్డేట్.. డెడ్‌లైన్ ఇదే..!
-
Rahul Gandhi: గిగ్ వర్కర్ల బాధ నాకు తెలుసు.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం..
ట్రెండింగ్
-
Virat Kohli: విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు.. మొదటి బ్యాటర్‌గా.. మరీ తక్కువ మ్యాచ్‌ల్లోనే!
-
India All Out List: వన్డేల్లో టీమిండియాకు ఘోర పరాభవం.. 100 లోపే భారత్ ఇన్నిసార్లు ఆలౌట్ అయిందా?
-
Children’s Day 2026 : మార్కుల వేట వద్దు.. పిల్లల్లో క్రియేటివిటీ పెంచండి
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్‌పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!