ప్రస్తుతం వినియోగదారులకు భారంగా మారిన టెలికాం ఛార్జీలు మరోసారి పెరిగే అవకాశం కనిపిస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలో జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా మరో విడత టారిఫ్‌లు పెంచే అవకాశాలున్నాయి. ఈ మేరకు దేశీయ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ ఒక నివేదికలో వెల్లడించింది. టెలికాం సంస్థలు తమ నెట్‌వర్క్, స్పెక్ట్రంపై ఇన్వెస్ట్ చేయాలంటే సగటున ప్రతి యూజర్‌పై వచ్చే ఆదాయాన్ని మరింత పెంచుకోవాల్సి ఉంటుందని… ఒకవేళ అలా చేయకపోతే సర్వీసుల్లో నాణ్యత లోపించే అవకాశం ఉందని…