వైవాహిక జీవితంలో బలవంతపు శృంగారాన్ని నేరంగా పరిగణించాలంటూ దాఖలైన పిటిషన్లపై తీర్పును రిజర్వ్‌లో ఉంచింది ఢిల్లీ హైకోర్టు. మరింత గడువు కోరుతూ.. పిటిషన్ విచారణ వాయిదా వేయాలన్న కేంద్రం విజ్ఞప్తిని తిరస్కరించింది హైకోర్టు.. అయితే, పిటిషన్లపై స్పందించేందుకు సమయం కావాలని కోరారు సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. అన్ని రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల సీఎస్‌లకు ఫిబ్రవరి 10న అభిప్రాయ సేకరణకు సమాచారం అందించామని, అయితే, ఇంకా స్పందన రాలేదని కోర్టుకు తెలిపారు. కానీ, కేంద్రం విజ్ఞప్తిని తోసిపుచ్చింది…