Bengaluru: బెంగళూర్ లో గొడ్డుమాంసం దొంగతనానికి దొంగలు మాస్టర్ ప్లాన్ చేశారు. ఏకంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) కార్యకర్తల ముసుగులో బీఫ్ మాంసాన్ని దోపిడి చేశారు. ఇందులో కీలక నిందితుడు గొడ్డుమాంసాన్ని అమ్మే వ్యక్తిగా తేల్చారు పోలీసులు. వివరాల్లోకి వెళ్తే ఆర్ఎస్ఎస్ కార్యకర్తలమని చెప్పుకుంటూ గొడ్డు మాంసాన్ని దోచుకోవడం, కిడ్నాపులకు పాల్పడుతున్న నలుగురు వ్యక్తుల్ని కర్ణాటక పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు.
వివరాలలోకి వెళ్తే.. మణిపూర్ రాష్ట్రం ఇంఫాల్ పశ్చిమ జిల్లా లోని ఓ గ్రామానికి చెందిన సెర్టో తంగ్‌తంగ్ కోమ్ ఆర్మీలో యువ సైనికునిగా విధులు నిర్వహిస్తున్నారు. కాగా ఈమధ్యనే సెలవు పైన ఇంటికి వచ్చారు. ఈ నేపథ్యంలో
Maharashtra: తప్పుడు మాటలు చెబుతూ, చేతబడులను, దోషాలను వదిలిస్తామంటూ కొందరు బాబాలు, మాంత్రికులు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. మహిళలపై అత్యాచారాలకు ఒడిగడుతున్నారు. ఇలాంటి ఘటనలు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా చాలానే వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా మరోసారి ఇలాంటి ఘటనే జరిగింది. మహారాష్ట్ర పాల్ఘర్ జిల్లాలో వాస్తుదోషాలు, చెడు దోషాలు వదిలిస్తానని చెబుతూ 35 ఏళ్ల మహిళపై ఓ వ్యక్తి పదేపదే అత్యాచారానికి పాల్పడ్డాడు.
Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్ లో దారుణం జరిగింది. సభ్యసమాజం తలవంచుకునే విధంగా, తండ్రిలా ఉండాల్సిన మామ, తన కొడలిపై దారుణానికి తెగబడ్డాడు. కొడుకు భార్య అనే సోయి లేకుండా అత్యాచారం చేశాడు. ఉత్తర్ ప్రదేశ్ లోని ముజఫర్ నగర్ జిల్లాలోని ఓ గ్రామంలో ఈ దారుణం జరిగింది. మామ తనపై అత్యాచారం చేశాడని ఆరోపిస్తూ 26 ఏళ్ల మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తను బెదిరించి, తీవ్రంగా కొట్టాడని చెప్పింది.
Nagpur: అత్యాచారం కేసు పెడతానని ఓ యువతి, ఆమె కుటుంబ సభ్యులు బ్లాక్మెయిల్ చేయడంతో ఓ వ్యక్తి ఫేస్బుక్ లైవ్ లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నాగ్‌పూర్ నగరానికి చెందిన 38 ఏళ్ల మనీష్ ను ఆమె స్నేహితురాలు బ్లాక్మెయిల్ చేసింది. ఆమె కుటుంబ సభ్యులు కూడా తీవ్రంగా భయపెట్టడంతో మనీష్ తనువు చాలించాడు. సెప్టెంబర్ 10న 38 ఏళ్ల వ్యక్తి మనీష్ తన ఫేస్బుక్ లైవ్‌లో, 19 ఏళ్ల కాజల్ అనే అమ్మాయి, ఆమె కుటుంబ సభ్యులచే…
Uttarakhand: యువతితో అక్రమ సంబంధం పెట్టుకున్న ఆర్మీ అధికారి దారుణానికి ఒడిగట్టాడు. ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ గా పనిచేస్తున్న రామెందు ఉపాధ్యాయ్ అనే వ్యక్తి నేపాల్‌కి చెందిన 30 ఏళ్ల యువతి శ్రేయ శర్మతో మూడేళ్లుగా డేటింగ్ చేస్తున్నాడు. ఇద్దరూ కూడా కలిసే ఉంటున్నారు. అప్పటికే పెళ్లైన రామెంద్ ఉపాధ్యాయ్, శ్రేయతో వివాహేతర సంబంధాన్ని నడుపుతున్నాడు. ఈ నేపథ్యంలో తనను పెళ్లి చేసుకోవాలని శ్రేయ ఒత్తిడి చేయడంతో దారుణంగా చంపేశాడు.
Rajasthan: రాజస్థాన్‌కి చెందిన ఓ మహిళ అసలు విషయం తెలిస్తే తన భర్త ఎక్కడ వదిలేస్తాడో అని ఏకంగా సామూహికి అత్యాచారానికి గురైనట్లు నాటకం ఆడింది. భిల్వారాలోని ఓ వివాహిత తానను అపహరించి, గ్యాంగ్ రేప్ చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణ జరిపిన పోలీసులు ఇదంతా వట్టిదే అని మహిళ నకిలీ రేప్ స్టోరీని అల్లిందని తేల్చారు.