Rajasthan: మద్యం మత్తులో తామ ఎంతటి దారుణానికి పాల్పడుతున్నారో తెలియలేదు. స్నేహితుడిని పొడిచి చంపారు. సిగరేట్ షేర్ చేసుకోలేదనే చిన్న కారణంతో ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన రాజస్ఠాన్ లోని ఉదయ్‌పూర్‌లో చోటు చేసుకుంది.ఈ కేసులో ప్రధాన నిందితుడు జై అలియాస్ జితేంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు.
Read Also: Raviteja: సెట్ లో రవితేజకు ప్రమాదం.. కాలికి 12 కుట్లు
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితుడు రోహిత్, అతని స్నేమిితులు జై, సుమిత్ సింగ్‌లతో కలిసి మద్యం సేవించాడు. రోహిత్ సిగరేట్ తాగే సమయంలో తమకు ఇవ్వాల్సిందిగా జై కోరాడు. రోహిత్ ఇవ్వకపోవడంతో జై, సుమిత్ ఇద్దరు కలిసి దాడి చేసి కత్తితో పొడిచి చంపారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రోహిత్ మరణించాడు.
దాడి తర్వాత ఇద్దరు నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. ఆ ప్రాంతంలో లభించిన సీసీటీవీ ఫుటేజీలో నిందితుడు కత్తితో దాడి చేసిన తర్వాత హడావుడిగా అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. హత్యలో ఇద్దరు నిందితుల ప్రయేయాన్ని సీసీటీవీలో రికార్డైన విజువల్స్ సూచిస్తున్నాయని పోలీసులు తెలిపారు. కొంతదూరం పారిపోయి, పడిపోయిన తమ సెల్ ఫోన్లు తీసుకోవడానికి వచ్చిన సమయంలో ఇద్దరు నిందితులు కెమెరాకు చిక్కారని పోలీసులు వెల్లడించారు. పారిపోయిన రెండో నిందితుడి కోసం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు.