Rajoli Crime News: భూతగాదాలు ఎంతటి దారుణానికైనా దారితీస్తాయి. భూతగాదాల కారణంగా సొంత అన్న దమ్ములే బద్ద శత్రువులుగా మారతారు. అంతేకాదు చంపుకున్న ఘటనలు కూడా ఎన్నో ఉన్నాయి. తాజాగా తెలంగాణ రాష్ట్రంలోని జోగుళాంబ గద్వాల జిల్లాలో మరో ఘటన చోటుచేసుకుంది. భూతగాదాల కారణంగా సోదరుడిని హత్య చేసి.. గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని మట్టుపెడదామనుకున్న ఇద్దరు అన్నదమ్ములు దొరికిపోయారు. వివరాలు ఇలా ఉన్నాయి… జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్ద ధన్వాడ గ్రామానికి చెందిన మహేశ్వర్…