కరోనా మహమ్మారి ఎంతో మంది జీవితాలను అల్లకల్లోలం చేసింది. కొందరికి పూటగడవడమే కష్టంగా మారింది. జాతీయ టోర్నమెంట్లలో ఆడి మంచి గుర్తింపు తెచ్చుకున్న రాజబాబుది కూడా అదే పరిస్థితి. రాజబాబు అనే విభిన్న ప్రతిభావంతుడైన క్రికెటర్ ఇప్పుడు ఘజియాబాద్‌లో ఇ-రిక్షా నడుపుతూ పాలు అమ్ముతున్నాడు.