ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. రాజ్‌కోట్‌లో ఇంగ్లాండ్ జట్టును 434 పరుగుల తేడాతో ఓడించింది. బ్యాటింగ్ లో యశస్వి జైస్వాల్ (214), సర్ఫరాజ్ ఖాన్ (68) పరుగులతో అదరగొడితే.. బౌలింగ్‌లో రవీంద్ర జడేజా స్పిన్ మాయజాలం చేశాడు. 557 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు 122 పరుగులకే ఆలౌట్ అయింది. రెండో ఇన్నింగ్స్‌లో రవీంద్ర జడేజా 5 వికెట్లు, కుల్దీప్ యాదవ్…
భారత్-ఇంగ్లాండ్ మధ్య రాజ్ కోట్లో మూడో టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. కాగా... ఈరోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 322 పరుగుల ఆధిక్యంలో ఉంది. రెండో ఇన్నింగ్స్ లో ఓపెనర్ యశస్వి జైస్వాల్ సెంచరీతో అదరగొట్టగా.. శుభ్‌మన్ గిల్ అర్ధ సెంచరీ చేయడంతో టీమిండియా భారీ స్కోరును నమోదు చేసింది. ఇక ఈరోజు ఆటముగిసే సమయానికి భారత్ స్కోరు 196/2 ఉంది.