ఐపీఎల్ 2024 మార్చి 22 నుండి ప్రారంభం కానుంది. దీని షెడ్యూల్కు సంబంధించి ఈ రోజు సాయంత్రం 5 గంటలకు వెలువడనుంది. కాగా.. షెడ్యూల్ ప్రకటించకముందే గుజరాత్ టైటాన్స్కు భారీ షాక్ తగిలింది. ఐపీఎల్ 2024 నుంచి గుజరాత్ టైటాన్స్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ దూరం అయ్యాడు. ఎడమ చీలమండ గాయం కారణంగా ఐపీఎల్ 2024 నుండి తప్పుకోవాల్సి వచ్చింది. ఇందుకు సంబంధించి బీసీసీఐ వర్గాలు సమాచారం అందించాయి. అయితే గుజరాత్ టైటాన్స్, ఐపీఎల్ వర్గాలు…
క్రికెట్ అభిమానులకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ గవర్నింగ్ కౌన్సిల్ శుభవార్త చెప్పింది. ఐపీఎల్ ఇండియాలో ఉంటుందా లేదా అనే దానిపై క్లారిటీ ఇచ్చింది. భారత్ లోనే ఐపీఎల్ 2024 నిర్వహించనున్నట్లు తెలిపింది. కాగా.. మార్చి 22 నుంచి ఐపీఎల్ మ్యాచ్లు ప్రారంభం కానున్నాయని ఇండియన్ ప్రీమియర్ లీగ్ గవర్నింగ్ కౌన్సిల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ తెలిపారు.