Home
Cricket News
Cricket News News
-
వివాదంలో విరాట్ కోహ్లీ… నిషేధం విధించాలని మాజీల డిమాండ్
దక్షిణాఫ్రికా పర్యటనలో టీమిండియా విరాట్ కోహ్లీ వివాదంలో ఇరుక్కున్నాడు. కేప్‌టౌన్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా కెప్టెన్ డీన్ ఎల్గర్ నాటౌట్‌కు సంబంధించి డీఆర్ఎస్ విషయంలో విరాట్ కోహ్లీ స్టంప్స్ మైక్ దగ్గరకు వెళ్లి ప్రసార కర్తలను ఉద్దేశించి మాట్లాడిన తీరు వివాదానికి దారి తీసింది. ఈ సందర్భంగా ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మైకెల్ వాన్ కోహ్లీపై విమర్శలు చేశాడు. కోహ్లీకి భారీ జరిమానా విధించాలని… అంతేకాకుండా కోహ్లీ నిషేధం విధించాలని డిమాండ్ చేశాడు. ఆటలో క్రికెటర్లు… -
ఈనెల 21న టీ20 ప్రపంచకప్ షెడ్యూల్: ఐసీసీ
టీ20 ప్రపంచకప్‌పై ఐసీసీ కీలక ప్రకటన చేసింది. ఆస్ట్రేలియా వేదికగా ఈ ఏడాది జరగనున్న పురుషుల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్‌ను ఈ నెల 21న విడుదల చేయనున్నట్లు ఐసీసీ తెలిపింది. ప్రపంచకప్ టోర్నీ మ్యాచ్‌లకు సంబంధించి టికెట్ల అమ్మకం ఫిబ్రవరి 7 నుంచి మొదలవుతుందని ఐసీసీ స్పష్టం చేసింది. 12 జట్లు పాల్గొనే ఈ మెగా టోర్నీ అక్టోబర్ 13 నుంచి నవంబర్ 16 మధ్య జరగనున్నట్లు తెలుస్తోంది. Read Also: ఇకనైనా విహారికి అవకాశం ఇవ్వండి:… -
ఇకనైనా విహారికి అవకాశం ఇవ్వండి: గంభీర్
టీమిండియా జట్టులో గత రెండేళ్లుగా పుజారా, రహానెలకు బీసీసీఐ వరుస అవకాశాలను ఇస్తోంది. అయినా వాళ్లిద్దరూ అరకొర సందర్భాల్లో తప్పితే పెద్దగా రాణించిన దాఖలాలు లేవు. ముఖ్యంగా పుజారా అయితే రెండేళ్లుగా సెంచరీనే చేయలేదు. ఇక రహానె పరిస్థితి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రహానె ఓ ఇన్నింగ్స్‌లో బాగా ఆడితే 10 ఇన్నింగ్సులు ఆడకుండానే జట్టులో స్థానం సంపాదిస్తున్నాడు. దీంతో జట్టు విజయావకాశాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీనికి దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీసే ఉదాహరణ. పుజారా,… -
కేప్‌టౌన్ టెస్టులో టీమిండియా ఓటమి.. సిరీస్ సమర్పయామి
సఫారీ గడ్డపై టీమిండియా మరోసారి నిరాశపరిచింది. రెండో టెస్టు మాదిరిగానే మూడో టెస్టులోనూ భారత్ ఓటమి పాలయ్యింది. కేప్‌టౌన్ వేదికగా జరిగిన మూడో టెస్టులో టీమిండియాపై ఏడు వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా ఘనవిజయం సాధించింది. 212 పరుగుల విజయలక్ష్యాన్ని నాలుగో రోజు లంచ్ ముగిసిన వెంటనే కేవలం మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ విజయంతో మూడు టెస్టుల సిరీస్‌ను 2-1 తేడాతో దక్షిణాఫ్రికా కైవసం చేసుకుంది. Read Also: బిగ్ బ్రేకింగ్: ఆస్ట్రేలియా ఓపెన్ నుంచి… -
రెండో రోజు ముగిసిన ఆట.. భారమంతా సీనియర్లపైనే..!!
కేప్‌టౌన్ టెస్టులో రెండో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా రెండు వికెట్ల నష్టానికి 57 పరుగులు చేసింది. మళ్లీ భారత ఓపెనర్లు దారుణంగా విఫలమయ్యారు. కేఎల్ రాహుల్ 10 పరుగులు, మయాంక్ అగర్వాల్ 7 పరుగులు మాత్రమే చేశారు. 24 పరుగులకే భారత్ రెండు వికెట్లు కోల్పోవడంతో పుజారా, విరాట్ కోహ్లీ ఆచితూచి ఆడారు. పుజారా 31 బంతుల్లో 9 పరుగులతో, కోహ్లీ 39 బంతుల్లో 14 పరుగులతో క్రీజులో… -
కేప్‌టౌన్ టెస్ట్: టీమిండియాకు స్వల్ప ఆధిక్యం
కేప్‌టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న నిర్ణయాత్మక టెస్టులో భారత బౌలర్లు తమ సత్తా చాటారు. తొలి ఇన్నింగ్స్‌ను సఫారీ జట్టును 210 పరుగులకు ఆలౌట్ చేశారు. దీంతో టీమిండియాకు 13 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. దక్షిణాఫ్రికా జట్టులో పీటర్సన్ 72 పరుగులతో రాణించాడు. బవుమా 28, కేశవ్ మహారాజ్ 25, డస్సెన్ 21 పరుగులు చేశారు. Read Also: టీమిండియా వన్డే జట్టులో సైనీ, జయంత్ యాదవ్‌లకు చోటు భారత బౌలర్లలో బుమ్రాకు 5 వికెట్లు… -
టీమిండియా వన్డే జట్టులో సైనీ, జయంత్ యాదవ్‌లకు చోటు
దక్షిణాఫ్రికాతో తలపడే టీమిండియా జట్టులో కొత్తగా ఇద్దరు ఆటగాళ్లకు సెలక్టర్లు అవకాశం ఇచ్చారు. గతంలో ప్రకటించిన జట్టులో వాషింగ్టన్ సుందర్ కరోనా బారిన పడి సిరీస్‌కు దూరం కాగా.. అతడి స్థానంలో కొత్తగా ఇద్దరు ఆటగాళ్లకు స్థానం కల్పించారు. ఈ మేరకు బౌలర్లు జయంత్ యాదవ్, నవదీప్ సైనీలను జట్టులోకి తీసుకుంటున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. జనవరి 19 నుంచి భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ జరగనుంది. 19న తొలి వన్డే, 21న రెండో వన్డే,… -
ఐపీఎల్-2022 మెగా వేలానికి ముహూర్తం ఫిక్స్
క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఐపీఎల్ -2022 మెగావేలానికి ముహూర్తం ఖరారైంది. ఫిబ్రవరి 12, 13 తేదీల్లో బెంగళూరు వేదికగా ఐపీఎల్ మెగా వేలం నిర్వహించనున్నట్లు ఐపీఎల్ ఛైర్మన్ బ్రిజేష్ పటేల్ వెల్లడించారు. అలాగే ఈ ఏడాది కొత్తగా వస్తున్న లక్నో, అహ్మదాబాద్ జట్లకు బీసీసీఐ ఫార్మల్ క్లియరెన్స్ కూడా ఇచ్చిందని ఆయన ప్రకటించారు. ఆయా ఫ్రాంఛైజీలకు లెటర్ ఆఫ్ ఇంటెంట్‌ను జారీ చేయాలని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుందని తెలిపారు. రెండు బిడ్లను గవర్నింగ్… -
విరాట్ కోహ్లీ మళ్లీ మిస్… 223 పరుగులకు భారత్ ఆలౌట్
కేప్‌టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 223 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ విరాట్ కోహ్లీ (79) ఒంటరి పోరాటం చేశాడు. సెంచరీ చేసేలా కనిపించిన కోహ్లీ.. మరోసారి అవుట్‌సైడ్ ఎడ్జ్‌తో రబాడ బౌలింగ్‌లో ఔటయ్యాడు. భారత ఇన్నింగ్స్‌లో పుజారా (43), రిషబ్ పంత్ (27) తప్ప ఎవరూ రాణించలేదు. దక్షిణాఫ్రికా బౌలర్లలో రబాడ 4 వికెట్లు, మాక్రో జాన్సన్ 3 వికెట్లతో సత్తా చాటారు. Read Also: అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్… -
అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన మరో స్టార్ క్రికెటర్
దక్షిణాఫ్రికా స్టార్ క్రికెట్ ఆల్‌రౌండర్ క్రిస్ మోరిస్ ఆటకు రిటైర్మెంట్ ప్రకటించాడు. అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. 34 ఏళ్ల మోరిస్ 12 ఏళ్ల కెరీర్‌కు ముగింపు పలికాడు. మూడు ఫార్మాట్లలో సఫారీ జట్టు తరఫున 69 మ్యాచ్‌లు ఆడిన మోరిస్ బౌలింగ్‌లో 94 వికెట్లు పడగొట్టాడు. 2012 డిసెంబర్లో టీ20ల్లో అరంగ్రేటం చేశాడు. తర్వాత ఏడాది వన్డేల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే అతడు టెస్టు అరంగ్రేటం కోసం చాలా కాలం వేచి చూడాల్సి వచ్చింది.…
తాజావార్తలు
-
HTT-40 Trainer Aircraft: IAFకు గుడ్‌న్యూస్.. తొలి 3 HTT-40 ట్రైనర్ విమానాల డెలివరీకి HAL సిద్ధం
-
KTR Injured: తెలంగాణ అసెంబ్లీ గేటు వద్ద తోపులాట.. కేటీఆర్ నుదుటికి, చేతికి గాయం!
-
Toxic OTT : రూ. 150 కోట్ల నుండి రూ. 30 కోట్లకు పడిపోయిన టాక్సిక్ OTT ఆఫర్!
-
Toxic: యశ్ ‘టాక్సిక్’లో ఈ 9 ఏళ్ల బుడ్డోడు ఎవరో తెలుసా? రాకీ భాయ్ ఇచ్చిన గిఫ్ట్‌ల వెనుక అసలు కథ ఇదే!
-
TDP Leadership Training Conclave: చంద్రబాబుకు అభినందన తీర్మానం.. స్టాండింగ్ ఓవేషన్
ట్రెండింగ్
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!
-
990 గ్రా.లకే ThinkBook..! మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్‌తో Lenovo IdeaPad Vibe సిరీస్ వచ్చేసింది.!
-
JIO: అదిరిపోయే ఆఫర్.. 5TB క్లౌడ్ స్టోరేజ్, 18 నెలల AI సబ్స్క్రిప్షన్, 2.5GB డైలీ డేటాతో ఏడాదిపాటు..!
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!