Lava Smart Phone: 6000mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్.. లావా నుంచి బడ్జెట్ ధరలో స్మార్ట్ ఫోన్ లాంచ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతీయ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ లావా తన పోర్ట్‌ఫోలియోలోకి మరో కొత్త 5జీ ఫోన్‌ను తీసుకొచ్చింది. తాజాగా మార్కెట్లోకి విడుదలైన ‘లావా షార్క్ 2 ప్రో 5జీ’ ధర రూ.17,000 లోపు ఉండటం విశేషం. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం ఆఫ్‌లైన్ రిటైలర్లు, సర్వీస్ ప్రొవైడర్ల వద్ద వివిధ ఫైనాన్షియల్ స్కీమ్‌లతో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ ఆకాశ్ బ్లూ, నందా సిల్వర్ అనే రెండు కలర్స్ ఆప్షన్లలో లభిస్తుంది. దీని ధర 6జీబీ రామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్‌కు రూ.16,699గా నిర్ణయించారు.
ఈ స్మార్ట్‌ఫోన్ ఫీచర్ల విషయానికి వస్తే.. ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.75 అంగుళాల HD+ డిస్ప్లేను అందించారు. మెరుగైన పనితీరు కోసం ఫోన్లో యూనిసాక్ T8200 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌ను అమర్చారు. దీనికి తోడు 6జీబీ రామ్‌తో పాటు మరో 6జీబీ వర్చువల్ రామ్ టెక్నాలజీని ఉపయోగించుకునే వెసులుబాటు ఉంది. ఇక ఇంటర్నల్ స్టోరేజ్ విషయానికి వస్తే 128జీబీ ఇస్తుండగా.. మైక్రో ఎస్డీ కార్డ్ ద్వారా దీనిని 1టీబీ వరకు పొడిగించుకోవచ్చు.
Also Read
- Transfer WhatsApp Chats: గూగుల్ డ్రైవ్ బ్యాకప్‌లతో పనిలేకుండా.. వాట్సాప్ చాట్స్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలంటే.? సింపుల్ ప్రాసెస్ ఇదిగో..
- IND-W vs ZIM-W: హర్మన్‌ప్రీత్ విధ్వంసం.. జింబాబ్వే ముందు భారీ టార్గెట్.!
- PM Modi: ‘దేశమే ప్రథమం’.. దేశ శత్రువులను గుర్తించి ఓడించాలి.. విజయదశమి వేళ ప్రధాని మోదీ పిలుపు.!
- 165Hz డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్తో అక్టోబర్ 27న రాబోతున్న REDMI K100..!
కెమెరా విభాగంలోనూ ఈ ఫోన్ ఆకట్టుకుంటుంది. ఫొటోగ్రఫీ కోసం వెనుక వైపు 50ఎంపీ ఏఐ ప్రధాన కెమెరాను పొందుపరిచారు. ఇందులో నైట్ మోడ్, హెచ్డీఆర్, పోర్ట్రైట్, ఫిల్మ్, ప్రో మోడ్, మోషన్ ఫోటో వంటి పలు ఫీచర్లు ఉన్నాయి. అలాగే ఒకే సమయంలో రెండు వేర్వేరు యాంగిల్స్ నుంచి వీడియోలను రికార్డ్ చేసే డ్యూయల్-వ్యూ వీడియో ఫీచర్‌ను కూడా అందించారు. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 8ఎంపీ కెమెరాను ఏర్పాటు చేశారు.
బ్యాకప్ కోసం ఈ ఫోన్లో శక్తివంతమైన 6000mAh బ్యాటరీని అమర్చారు. ఇది 18W ఫాస్ట్ చార్జింగ్కు సపోర్ట్ చేస్తుంది. భద్రత కోసం ఫోన్ కుడి వైపున సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో పాటు ఫేస్ అన్‌లాక్ ఫీచర్ ఉంది. అంతేకాకుండా ఇది IP64 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ రేటింగ్‌ను కలిగి ఉంది. సాఫ్ట్వేర్ పరంగా ఈ ఫోన్ లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. లావా కంపెనీ ఇందులో ఎలాంటి ప్రీ-ఇన్స్టాల్డ్ యాప్స్ లేని క్లీన్ యూజర్ ఇంటర్ఫేస్ను అందించింది. అంతేకాకుండా ఒక మేజర్ ఆండ్రాయిడ్ ఓఎస్ అప్‌గ్రేడ్, రెండేళ్ల పాటు సెక్యూరిటీ అప్డేట్లు ఇస్తామని కంపెనీ స్పష్టం చేసింది. ఇందులో ప్రత్యేకంగా ‘వాయు ఏఐ’ అసిస్టెంట్‌ను కూడా చేర్చారు.
తాజావార్తలు
-
CM Chandrababu : రీల్స్ నుంచి బయటకు రండి.. చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
-
Transfer WhatsApp Chats: గూగుల్ డ్రైవ్ బ్యాకప్‌లతో పనిలేకుండా.. వాట్సాప్ చాట్స్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలంటే.? సింపుల్ ప్రాసెస్ ఇదిగో..
-
IND-W vs ZIM-W: హర్మన్‌ప్రీత్ విధ్వంసం.. జింబాబ్వే ముందు భారీ టార్గెట్.!
-
PM Modi: ‘దేశమే ప్రథమం’.. దేశ శత్రువులను గుర్తించి ఓడించాలి.. విజయదశమి వేళ ప్రధాని మోదీ పిలుపు.!
-
MVSR College : దాండియా వేడుకలో ప్రాణం తీసిన నిర్లక్ష్యం.. ముగ్గురు అరెస్ట్
ట్రెండింగ్
-
165Hz డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్తో అక్టోబర్ 27న రాబోతున్న REDMI K100..!
-
Virat Kohli: కోహ్లీకి గోల్డెన్ ఛాన్స్.. సాధిస్తే ప్రపంచంలో తొలి బ్యాటర్‌గా రికార్డు.!
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..
-
India Playing XI: రోహిత్-గిల్ ఓపెనర్స్.. కోహ్లీ మూడో స్థానంలో.! 2027 ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసిన టీమిండియా మాజీ ప్లేయర్.!