బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ మాత్రం ఈ మ్యాచ్ చూడటానికి రావొద్దని కొందరు నెటిజన్లు కోరుతున్నారు. అందుకు గల కారణాలు లేకపోలేదు.. రెండు రోజుల క్రితం జరిగిన సెమీ ఫైనల్స్‌లో న్యూజిలాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ గెలిచింది. దీనిపై అమితాబ్ ట్విట్టర్ (ఎక్స్) వేదికగా స్పందిస్తూ.. నేను సెమీ ఫైనల్ మ్యాచ్ చూడకపోతే గెలిచారంటూ ఆయన రాసుకొచ్చారు.